![]() |
![]() |
.webp)
స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు'(illu illalu pillalu). ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -456 లో.... శ్రీవల్లి నెలతప్పినందుకు రామరాజు ఇంట్లో సాయంత్రం గ్రాంఢ్ గా ఫంక్షన్ చేస్తుంటారు. దానికి సంబందించిన ఏర్పాట్లన్నీ రామరాజు బామ్మర్ది తిరుపతి చేస్తాడు. ఇక రామరాజు వచ్చి.. తొందరగా పనులు చేయిరా అని చెప్పి వెళ్తాడు. ఇక మరోవైపు శ్రీవల్లి ఏ చీర కట్టుకోవాలో అర్థం కాక తికమకపడుతుంటే వేదవతి అడుగుతుంది. ఈ రెండు చీరలు వద్దు అని వేదవతి అంటుంది. మరి అనగానే అమూల్య వెళ్ళి తీసుకురా అని వేదవతి తనని లోపలికి పంపిస్తుంది. ఇక అమూల్య కొత్తచీర, నగలు తీసుకొస్తుంది. సాయంత్రం ఫంక్షన్ కి ఈ చీర, నగలు పెట్టుకోవాలని అనగానే శ్రీవల్లితో పాటు అందరు సంతోషిస్తారు.
అయితే భాగ్యం మాత్రం.. ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అని ఇంత చిన్న విషయం అని అంటుంది. ఇక అప్పుడే రామరాజు వచ్చి.. ఇది చిన్న విషయం కాదు.. మా వంశానికి సార్థకత రాబోతుంది.. ఈ ఇంటికి వారసుడు రాబోతున్నాడు.. నేను తాతని కాబోతున్నా అంటు రామరాజు గొప్పగా చెప్తుంటాడు. ఇక అది విని భాగ్యం జరిగింది గుర్తుచేసుకుంటుంది. శ్రీవల్లి హాస్పిటల్ లో ఉన్నప్పుడు డాక్టర్ ని రిక్వెస్ట్ చేసి తనతో శ్రీవల్లి నెలతప్పింది అని అబద్ధం చెప్పిస్తుంది భాగ్యం. వీళ్ళంతా ఇంత సంతోషంగా ఉన్నారు అసలు నిజం తెలిస్తే నేను ఏమైపోతానో ఏమో అని భాగ్యం టెన్షన్ పడుతుంది. అది గమనిస్తుంది నర్మద. వెంటనే భాగ్యం దగ్గరికి వచ్చి.. ఏమైంది పిన్ని అని అడిగేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడిన భాగ్యం.. ఏదో ఒకటి చెప్పి కవర్ చేస్తుంది.
ఇక అందరు రెడి అవుతుంటారు . ఇక ప్రేమ మీద బల్లి పడిందని తన గదిలో నుండి బయటకి పరుగున వస్తుంది ప్రేమ. ఇక అందరు హాల్లోకి వస్తారు. ప్రేమని చూసి అందరు ఆటపట్టిస్తుంటే నర్మద తనకి సపోర్ట్ గా ఉంటూ భాగ్యం వాళ్ళకి పంచ్ లు వేస్తుంటుంది. అది గమనించిన ఆనందరావు.. భాగ్యంతో మన గురించే అంటున్నారని అంటాడు. సర్లే అని భాగ్యం వెళ్ళిపోతుంది. ఇక సాయంత్రం ఫంక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇక అందులో శ్రీవల్లిని నర్మద, ప్రేమ ఆడుకుంటుంటే అప్పుడే అక్కడికి నర్మద వాళ్ళ అమ్మానాన్నలు వస్తారు. అదే సమయంలో రామరాజు అక్కడికి వస్తాడు. గొడవ అవుతుందేమోనని అందరు టెన్షన్ పడతారు. ధీరజ్ వచ్చి నేనే రమ్మన్నాను నాన్న.. మనం ఇలా సంతోషంగా ఉన్నామంటే నర్మద వదిన సహకారం కూడా ఉంది.. అందుకే వదిన వాళ్ళ పేరెంట్స్ వస్తే తను సంతోషంగా ఉంటుందని రమ్మన్నాని ధీరజ్ అనగానే మీ అమ్మనాన్నలు వెళ్ళేవరకు వారికి జాగ్రత్తగా మర్యాదలు చేయమ్మా అని నర్మదతో చెప్పి రామరాజు వెళ్తాడు. ఇక వేదవతి వారిని మర్యాదగా ఆహ్వానిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |